కోహ్లీని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన స్టొయినిస్... వీడియో ఇదిగో!

  • చెన్నైలో భారత్, ఆసీస్ చివరి వన్డే
  • టీమిండియా ఇన్నింగ్స్ లో ఆసక్తికర సంఘటన
  • కోహ్లీని బలంగా ఢీకొట్టిన స్టొయినిస్
  • కోపంగా ఓ లుక్కేసిన కోహ్లీ
  • నవ్వుకుంటూ వెళ్లిపోయిన స్టొయినిస్
Stoinis tries to provoke Kohli

టీమిండియా, ఆస్ట్రేలియా చివరి వన్డే సందర్భంగా మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆసీస్ విసిరిన 270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... టీమిండియా ఆశావహ రీతిలో ఆడుతోంది. స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ తన క్లాస్ ఆటతీరుతో రాణిస్తున్నాడు. అయితే, కోహ్లీని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన ఆసీస్ ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ విఫలం అయ్యాడు. 

టీమిండియా ఇన్నింగ్స్ లో 21వ ఓవర్ ను స్టొయినిస్ విసిరాడు. ఆ ఓవర్లో కోహ్లీ క్రీజులోకి వస్తుండగా, స్టొయినిస్ బలంగా ఢీకొట్టాడు. కోహ్లీ తనదైన శైలిలో ఓ సీరియస్ లుక్ విసిరి వెళ్లిపోయాడు. స్టొయినిస్ నవ్వుకుంటూ బౌలింగ్ పాయింట్ వద్దకు చేరుకోవడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News