బాలయ్య సినిమాలో నా క్యారెక్టర్ గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు: శ్రీలీల

  • టాలీవుడ్ లో అచ్చ తెలుగు అందం శ్రీలీల
  • వరుసగా అవకాశాలు చేజిక్కించుకుంటున్న భామ
  • ధమాకాతో హిట్ కొట్టిన వైనం
  • బాలకృష్ణ చిత్రంలో నటిస్తుండడంపై శ్రీలీల హర్షం
Sree Leela about Balakrishna movie

అచ్చ తెలుగు అందం శ్రీలీల టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళుతోంది. ఇటీవల ధమాకాతో హిట్ అందుకుంది. అగ్రహీరో బాలకృష్ణతోనూ ఈ స్లిమ్ బ్యూటీ ఓ చిత్రంలో నటిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

తాను నందమూరి బాలకృష్ణకు వీరాభిమానినని వెల్లడించింది. ఆయనతో సినిమాలో నటిస్తున్నప్పటి నుంచి ఇంకా అభిమానించడం మొదలుపెట్టానని వివరించింది. బాలయ్యది ఎంతో గొప్ప వ్యక్తిత్వం అని తెలిపింది. బాలకృష్ణతో సినిమాలో నా క్యారెక్టర్ గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు అని వివరించింది. 

కాగా, మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రంలోనూ నటిస్తున్నానని శ్రీలీల వెల్లడించింది. రామ్, వైష్ణవ్ తేజ్, నవీన్ పొలిశెట్టిల చిత్రాల్లోనూ నటిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.

More Telugu News