లక్ష్యఛేదనలో నిలకడగా ఆడుతున్న టీమిండియా

  • చెన్నైలో భారత్, ఆసీస్ మధ్య చివరి వన్డే
  • 49 ఓవర్లలో 269 పరుగులకు ఆసీస్ ఆలౌట్
  • లక్ష్యఛేదనలో 24 ఓవర్లలో 2 వికెట్లకు 121 పరుగులు చేసిన భారత్
Team India study chasing against Aussies

ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో టీమిండియా నిలకడగా ఆడుతుంది. చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ కాగా... లక్ష్యఛేదనలో టీమిండియా 24 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 121 పరుగులు చేసింది. టీమిండియా గెలవాలంటే ఇంకా 26 ఓవర్లలో 149 పరుగులు చేయాలి. 

ఓపెనర్లు రోహిత్ శర్మ (30), శుభ్ మాన్ గిల్ (37) తొలి వికెట్ కు 65 పరుగులు జోడించారు. ఆ తర్వాత కోహ్లీ, కేఎల్ రాహుల్ స్కోరుబోర్డును నడిపించే బాధ్యతను స్వీకరించారు. ప్రస్తుతం కోహ్లీ 36 పరుగులతోనూ, రాహుల్ 16 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. కాగా, ఆసీస్ బౌలర్లలో షాన్ అబ్బాట్, ఆడమ్ జంపా 1 వికెట్ తీశారు.

More Telugu News