Tamil Nadu: విజయవాడ రైల్వే స్టేషన్‌లో రూ. 7.48 కోట్ల విలువైన బంగారం పట్టివేత

About 13 kg gold worth Rs 7 cr seized in Vijayawada Railway Station
  • తమిళనాడు నుంచి ఏపీకి తరలిస్తుండగా పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
  • మొత్తం 12.97 కిలోల బంగారం స్వాధీనం
  • బిస్కెట్లు, ఆభరణాల రూపంలో ఉన్న పుత్తడి
  • నిందితుల అరెస్ట్
విజయవాడ రైల్వే స్టేషన్‌లో దాదాపు ఏడున్నర కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. తమిళనాడు నుంచి ఏపీకి పెద్ద ఎత్తున బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. 

దీంతో పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద కాపు కాశారు. ఈ సందర్భంగా అనుమానాస్పందగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా 5 కేజీల బంగారం లభించింది. అనంతరం వారిని ప్రశ్నించగా మరికొందరి సమాచారం లభించింది. దీంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

మొత్తంగా 12.97 కిలోల బంగారాన్ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 7.48 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన బంగారంలో కొంత బిస్కెట్ల రూపంలో ఉండగా, మరికొంత ఆభరణాల రూపంలో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tamil Nadu
Andhra Pradesh
Gold
Gold Jewellery
Gold Biscuits

More Telugu News