ఏపీ ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ

  • ఇటీవల రాష్ట్రంలో అకాల వర్షాలు
  • తీవ్రంగా దెబ్బతిన్న రైతాంగం
  • నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్న చంద్రబాబు
  • వర్షాలతో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించాలని విజ్ఞప్తి
Chandrababu wrote AP CS

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా దెబ్బతిన్నదని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలతో మరణించిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందించాలని కోరారు. 

ఉద్యాన, వాణిజ్య పంటల నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని తన లేఖలో స్పష్టం చేశారు. తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని చంద్రబాబు సూచించారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న ఆస్తికి పరిహారం చెల్లించాలని తెలిపారు.

More Telugu News