పాండ్యా ఫైర్... ఆసీస్ వికెట్లు టపటపా!

  • చెన్నైలో చివరి వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
  • నిప్పులు చెరిగిన పాండ్యా
  • 3 ఓవర్లలో 3 వికెట్లు తీసిన పాండ్యా
Hardika Pandya on fire as Australia loses three wickets in quick session

తొలి రెండు వన్డేల్లో ఏమంత ప్రభావం చూపని హార్దిక్ పాండ్యా ఆసీస్ తో చివరి వన్డేలో నిప్పులు చెరిగే బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. చెన్నైలో టీమిండియాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఓ దశలో భారీ స్కోరుపై కన్నేసినట్టే కనిపించింది. 

అయితే హార్దిక్ పాండ్యా బంతిని అందుకోవడంతో పరిస్థితి మారిపోయింది. తొలుత ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (33)ను అవుట్ చేసిన పాండ్యా... ఆ తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ (0)ను డకౌట్ చేయడంతో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. 

ఆ తర్వాత విధ్వంసక ఫామ్ లో ఉన్న ప్రమాదకర ఆటగాడు మిచెల్ మార్ష్ (47)ను పాండ్యా ఓ చక్కటి బంతితో బౌల్డ్ చేశాడు. దాంతో ఆసీస్ కేవలం 17 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 16 ఓవర్లలో 3 వికెట్లకు 92 పరుగులు. డేవిడ్ వార్నర్ 7, మార్నస్ లబుషేన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

More Telugu News