Uganda: ఉగాండా: స్వలింగ సంబధాలు నెరిపితే మరణశిక్ష

  • గే, హోమోసెక్స్ తదితర చర్యలకు కఠిన శిక్షలు
  • జీవితకాల జైలు, మరణ శిక్షలు ప్రతిపాదన
  • బిల్లుకు ఆమోదం తెలిపిన ఉగాండా పార్లమెంటు
  • అధ్యక్షుడి ఆమోదంతో చట్టరూపం
Uganda outlaws identifying as LGBTQ imposes death penalty for gay sex

ఉగాండా పార్లమెంటు మంగళవారం ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. లెస్బేనియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్జీబీటీక్యూ) గా గుర్తించడాన్ని నేరంగా పరిగణించింది. ఇప్పటికే 30 ఆఫ్రికా దేశాలు స్వలింగ సంబంధాలను నిషేధించాయి. ఉగాండా మాత్రం ఓ అడుగు ముందుకు వేసింది. ఎల్జీబీటీక్యూని చట్టవిరుద్ధమని ప్రకటించింది. గే సెక్స్ కు మరణ శిక్షను ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఉద్దేశం ప్రకృతి విరుద్ధమైన సంబంధాలను నిరోధించడమే. అందుకే చట్ట ఉల్లంఘనకు పాల్పడితే కఠిన శిక్షలు ప్రతిపాదించింది. 

హోమోసెక్స్, గే సెక్స్ చర్యలకు జీవిత కాలం జైలు శిక్ష, మరణ శిక్షలను ప్రతిపాదించింది. బిల్లుని అధ్యక్షుడు యొవేరి ముసెవేనికి పంపించారు. అక్కడ ఆమోదం తర్వాత చట్ట రూపం దాలుస్తుంది. పాఠశాలల్లో హోమోసెక్సువాలిటీ కోసం విద్యార్థులను చేర్చుకుంటున్నట్టు అక్కడి రాజకీయ, మతపరమైన నాయకులు ఆరోపిస్తుండడంతో.. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన వారిపై ఉగాండా సర్కారు ఇటీవల కఠిన చర్యలకు ఉపక్రమించింది. టీచర్ తోపాటు పలువురిని అరెస్ట్ చేసింది. సంప్రదాయ విలువలకు భిన్నంగా ఉన్న ఎల్జీబీటీక్యూ చర్యలను కఠినంగా శిక్షించాలంటూ ఈ బిల్లును సమర్థిస్తున్న వారు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News