మన దేశంలో అత్యంత విలువ సెలబ్రిటీ బ్రాండ్ ఎవరో తెలుసా?

 • మొదటి స్థానానికి చేరిన బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్
 • ఆయన విలువ రూ.1,500 కోట్లు
 • రూ.1,450 కోట్లతో రెండో స్థానానికి పడిపోయిన కోహ్లీ
 • టాప్ 25లో అల్లు అర్జున్, రష్మిక మందన్నకు చోటు
Ranveer Singh surpasses Virat Kohli to become Indias most valued celebrity of 2022

దేశంలో సెలబ్రిటీల విలువ పెరిగిపోతోంది. దీంతో వారి స్థానాలు తారుమారవుతున్నాయి. అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్ గా 2022 సంవత్సరానికి బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నిలిచారు. కార్పొరేట్ ఇన్వెస్టిగేషన్ అండ్ రిస్క్ కన్సల్టింగ్ సంస్థ క్రోల్ ఈ వివరాలతో ఒక నివేదికను విడుదల చేసింది. 

 • రణవీర్ సింగ్ బ్రాండ్ విలువ 181.7 మిలియన్ డాలర్లు. రూపాయిల్లో రూ.1,500 కోట్లు. 
 • స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇక రెండో స్థానంలో ఉన్నాడు. ఐదేళ్లుగా మొదటి స్థానంలో ఉంటూ వస్తున్న కోహ్లీ ఆ స్థానాన్ని రణవీర్ సింగ్ కు కోల్పోయాడు. కోహ్లీ విలువ 176.9 (రూ.1450 కోట్లు) మిలియన్ డాలర్లుగా ఉంది. 
 • కెప్టెన్సీ స్థానాన్ని విరాట్ కోహ్లీ కోల్పోవడంతో గడిచిన రెండు సంవత్సరాలుగా బ్రాండ్ విలువ తగ్గుతూ వస్తోంది. 2020లో 237 మిలియన్ డాలర్లు ఉంటే, 2021లో 185.7 మిలియన్ డాలర్లకు పడిపోయింది.
 • బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ 153.6 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. 
 • నటి అలియా భట్ 102.9 మిలియన్ డాలర్లతో తన నాలుగో స్థానాన్ని కాపాడుకుంది. అంతేకాదు అత్యంత విలువైన మహిళా సెలబ్రిటీగా నిలిచింది. 
 • ఐదో స్థానంలో ఉన్న దీపికా పదుకొణే విలువ 82.9 మిలియన్ డాలర్లుగా ఉంది. 
 • అమితాబచ్చన్, హృతిక్ రోషన్, షారూక్ ఖాన్ టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారు. 
 • చెన్నై జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ 80 మిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. 
 • సచిన్ టెండుల్కర్ 73.6 మిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. 
 • 2022లో టాప్25 సెలబ్రిటీల విలువ 1.6 బిలియన్ డాలర్లుగా ఉంది. 
 • అల్లు అర్జున్, రష్మిక మందన్న తొలిసారి టాప్25 సెలబ్రిటీల్లోకి వచ్చేశారు. అల్లు అర్జున్ విలువ 31.4 మిలియన్ డాలర్లు (రూ.257 కోట్లు)గా ఉంటే, రష్మిక విలువ 25.3 మిలియన్ డాలర్లు (రూ.207 కోట్లు)గా ఉంది.
 • పీవీ సింధు సైతం టాప్ 25లో ఉన్నారు. విలువ 26.5 మిలియన్ డాలర్లుగా ఉంది.

More Telugu News