Ugadi: ఉగాది నాడు ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం

  • రావి ఆకుతో దీపారాధనతో అనుకూల ఫలితాలు
  • సకల దుఃఖాలు తొలగి లక్ష్మీ కటాక్షం
  • రావి ఆకులపై దీపపు ప్రమిదతో దీపారాధన చేయాలనేది పెద్దల సూచన
Ugadi celebrations laxmi pooja

భారత సనాతన సంప్రదాయంలో ప్రతి పండగ వెనుక అర్థం పరమార్థం ఉంటాయి. ఇక తెలుగు ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఉగాది నాడు బ్రహ్మ సృష్టి ప్రారంభించాడని ప్రతీతి. మామిడి తోరణాలు, ఉగాది పచ్చడి.. పంచాగ శ్రవణం..తదితర కార్యక్రమాలతో ఉగాదిన తెలుగు లోగిళ్లు కళకళలాడుతుంటాయి. 

అయితే.. ఉగాది రోజున ఇష్టదేవతలను ముఖ్యంగా..లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో అర్చన చేస్తే అమ్మవారి కటాక్షం తప్పక లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఉగాది నాడు రావి ఆకుతో దీపారాధన వల్ల సకల శుభాలూ కలుగుతాయి. అయితే.. ఈ దీపాన్ని సాయంత్రం సమయంలో వెలిగించాలి. రావి చెట్టు ఆకులను దేవుని మందిరంలో పెట్టి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప, దోష, కర్మల తాలూకు ప్రతికూల ఫలితాలు వేధించవు. గత జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. రావి చెట్టు ఆకులపై దీపపు ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి కార్యసిద్ధి కలుగుతుందని, సుఖసంతోషాలు లభిస్తాయని పెద్దలు చెబుతారు.

More Telugu News