తెలంగాణ నిత్య వసంతం.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు
- ఈ ఉగాది రైతులకు, ప్రజలకు శుభాలు చేకూర్చాలన్న కేసీఆర్
- తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందన్న సీఎం
- దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్న కేసీఆర్
సాగు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణ నిత్యవసంతంగా మారిందన్న కేసీఆర్.. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందన్నారు. తెలంగాణ సాధించే ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ అన్నారు.