'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి 'న్యూసెన్స్' .. ఆసక్తిని రేపుతున్న టీజర్!

  • సమాజంలోని అరాచకాలకు అద్దం పట్టే 'న్యూసెన్స్'
  • పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి వెబ్ సిరీస్ ఇది 
  • జర్నలిస్టు పాత్రను పోషించిన నవదీప్ 
  • టీవీ రిపోర్టర్ గా కనిపిస్తున్న బిందుమాధవి

Newsense WebSeries teaser release

'ఆహా' తెలుగు ఓటీటీ వారు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను వదలడానికి రెడీ అవుతున్నారు. ఆ వెబ్ సిరీస్ పేరే 'న్యూసెన్స్'. భారీ సినిమాలను వరుసగా నిర్మిస్తూ వస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారే ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. శ్రీ పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో నవదీప్ - బిందుమాధవి ప్రధానమైన పాత్రలను పోషించారు. 

కొంతసేపటి క్రితం సీజన్ 1కి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన టీజర్ ఆసక్తిని పెంచుతోంది. 'వాస్తవాల్ని మీడియా చూపిస్తుందా? లేక మీడియా చూపించేవన్నీ వాస్తవాలా? అనే పాయింట్ పైనే ఈ టీజర్ మొదలైంది. జర్నలిస్ట్ గా నవదీప్ .. టీవీ రిపోర్టర్ గా బిందుమాధవి కనిపిస్తున్నారు. 

ఒక వైపున స్వార్థ రాజకీయాలు .. మరో వైపున అవినీతి పోలీసు అధికారులు .. మరో వైపున కాసుల కోసం వాస్తవాలను కప్పిపుచ్చే రిపోర్టర్లు .. ఈ మూడు కోణాల్లో ఈ కథ నడుస్తుందనే విషయం ఈ టీజర్ ద్వారా అర్థమవుతోంది. సురేశ్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ వెబ్ సిరీస్ కి ప్రధానమైన బలంగా నిలిచేదిలా కనిపిస్తోంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించనున్నారు. 

More Telugu News