K Kavitha: ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ముగిసిన కవిత విచారణ

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు
  • కవితను నేడు మూడోసారి ప్రశ్నించిన ఈడీ
  • 8.30 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు
 ED inquiry on Kavitha concludes

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ కూడా ప్రశ్నించారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో నిర్వహించిన ఈ విచారణ ముగిసింది. కవిత నేడు మొత్తం 10 గంటల పాటు ఈడీ కార్యాలయంలో ఉండగా, ఆమెను 8.30 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం కవిత ఈడీ కార్యాలయం నుంచి వెలుపలికి వచ్చారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ అంటూ కొందరు నేతల పేర్లను ఈడీ పేర్కొంది. అందులో కవిత కూడా ఉన్నారు. ఈ సౌత్ గ్రూప్ ను నియంత్రించింది శరత్ చంద్రారెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట తనయుడు రాఘవ అని ఈడీ ఆరోపిస్తోంది. కాగా, కవిత వాడిన పది ఫోన్లను ఆధారాలు దొరక్కుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే తన ఫోన్లన్నంటినీ ఇవాళ కవిత ఈడీ కార్యాలయానికి తీసుకురావడం ఆసక్తి కలిగించింది.

More Telugu News