'హలో మీరా' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ!

  • గార్గేయి ప్రధాన పాత్రగా రూపొందిన 'హలో మీరా'
  • ఇది ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ 
  • దర్శకుడిగా కాకర్ల శ్రీనివాస్ పరిచయం
  • సంగీతాన్ని అందించిన చిన్నా

Hello Meera movie sing released


ప్రస్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆదరణ లభిస్తోంది. కమర్షియల్ సినిమాలతో పాటుగా కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు తెరపై ఎక్కువగా ప్రయోగాత్మక కథలు వస్తున్నాయి. ఆసక్తికర కథ .. కథనంతో ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో  మేకర్లు సక్సెస్ అవుతున్నారు. అదే బాటలో తాజాగా  'హలో మీరా' అంటూ ఓ వైవిధ్యభరితమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 

ఈ సినిమాకి కాకర్ల శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.  ప్రముఖ దర్శకులు శ్రీ బాపు గారితో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవాన్ని రంగరించి, 'హలో మీరా' సినిమాతో ఆయన  ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించడం కత్తి మీద సాము. అలాంటి సాహసాన్ని 'హలో మీరా టీమ్' చేయబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమా మీద ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. సింగిల్ కారెక్టర్‌తో సినిమాను ఎలా నడిపించారు? అనే ఇంట్రెస్ట్‌ను ప్రేక్షకులకు కలిగిచారు. 

తాజాగా ఈ మూవీ నుంచి 'నా కనులలో .. నా కలలలో' అంటూ సాగే ఎమోషనల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. శ్రీ సాయి కిరణ్ సాహిత్యం, సమీర భరద్వాజ్ గాత్రం, ఎస్ చిన్నా బాణీ ఈ పాటను ఎంతో వినసొంపుగా మార్చేశాయి. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో ఈ ప్రయోగాత్మక  చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో 'మీరా'గా గార్గేయి యల్లాప్రగడ నటించారు.  హిరణ్మయి కల్యాణ్ మాటలు రాశారు. రాంబాబు మేడికొండ ఎడిటర్ గా వర్క్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్లు ప్రకటించనున్నారు.

More Telugu News