Bandi Sanjay: పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్ కి సిట్ నోటీసులు

SIT issues notice to Bandi Sanjay in TSPSC question paper leak
  • టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం
  • తీవ్ర ఆరోపణలు చేసిన బండి సంజయ్
  • ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలన్న సిట్
  • ఈ నెల 24న తమ ఎదుట హాజరుకావాలని నోటీసులు
టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న తమ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ అంశంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని సిట్ బండి సంజయ్ ని కోరింది. ఇటీవల టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ కాగా, ఒకే ఊరిలో ఎక్కువమందికి 100 మార్కులు వచ్చాయని బండి సంజయ్ ఆరోపించారు. 

సరిగ్గా, ఇలాంటి ఆరోపణలు చేసిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఈ నెల 23న ఆధారాలతో సహా రావాలంటూ సిట్ రేవంత్ రెడ్డికి స్పష్టం చేసింది.
Bandi Sanjay
SIT
Notice
TSPSC
Question Paper
Leak
Telangana

More Telugu News