టెస్లా కార్ల ‘నాటు నాటు’ స్టెప్పులకు రాజమౌళి ఫిదా!
- ‘నాటు నాటు’ పాటపై టెస్లా లైట్ షో
- కార్ల లైట్లు ఆరుతూ వెలుగుతూ లయబద్ధంగా విన్యాసాలు
- నిజంగా పొంగిపోతున్నానంటూ రాజమౌళి ట్వీట్
- అద్భుతమైన ప్రదర్శన అని వ్యాఖ్య
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. ‘‘నాటు నాటుకి మీరు ఇచ్చిన ఈ ట్రిబ్యూట్ కి నేను నిజంగా పొంగిపోతున్నా. ఇది ఒక అద్భుతమైన ప్రదర్శన” అంటూ ట్వీట్ చేశారు.
అలాగే ఆ షో నిర్వహించిన నార్త్ అమెరికన్ సీమాంధ్ర అసోసియేషన్ సభ్యులు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, ఈ లైట్ షోలో భాగమైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘అందరి ప్రేమకు ధన్యవాదాలు’’ అని ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా ట్వీట్ చేసింది. మరోవైపు టెస్లా కార్ల లైట్ షోపై ట్విట్టర్ సీఈవో, టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ కూడా స్పందించడం గమనార్హం. రెండు లవ్ సింబల్స్ ను ఆయన ట్వీట్ చేశారు.