AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోవడం లేదన్న కేంద్రం
  • ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని పార్లమెంటులో వెల్లడి
  • 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఈ నిర్ణయమని వివరణ
  • ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్టు స్పష్టీకరణ
Center gives clarity on special status for AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోవడంలేదని పార్లమెంటులో స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని పేర్కొంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే ఈ నిర్ణయం అని కేంద్రం వెల్లడించింది. ఆర్థిక లోటు భర్తీకి 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించిందని వివరించింది. 

దీంతో ప్రత్యేక రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలకు మధ్య అంతరం తొలగిపోయిందని తెలిపింది. హోదాకు బదులుగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని కేంద్రం స్పష్టం చేసింది. ప్యాకేజీ కింద నిధులు కూడా విడుదల చేశామని వివరించింది. ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చింది. 

More Telugu News