Nani: ఇప్పుడు నేను 73 కథలు వినాల్సి ఉంది: హీరో నాని

Nani Interview
  • నాని తాజాగా చిత్రంగా రూపొందిన 'దసరా'
  • ఈ నెల 30వ తేదీన సినిమా విడుదల
  • జోరుగా కొనసాగుతున్న ప్రమోషన్స్  
  • అరగంట వినగానే కథ గురించి తెలిసిపోతుందన్న నాని

నాని తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'దసరా' రెడీ అవుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. 

"శ్రీకాంత్ ఓదెల కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. అందువలన ఒక గంటలో కథ చెప్పేయమని అన్నాను. కానీ ఆయన కథను చెప్పడం మొదలుపెట్టిన తరువాత నాలుగు గంటల పాటు అలా వింటూ ఉండిపోయాను. దీనిని బట్టి కథలో ఎంత విషయం ఉందనేది మీరే అర్థం చేసుకోవచ్చును " అన్నాడు. 

"నాని కథ వినడానికి ఎక్కువ టైమ్ ఇవ్వడు అంటూ ఉంటారు. నిజానికి ఒక అరగంట వినగానే ఆ కథలో విషయం ఉందా లేదా అనేది అర్థమైపోతుంది. 3 గంటలు వినేసి బాగోలేదంటే బాధపడతారు .. వాళ్ల సమయం వేస్ట్ అవుతుంది. నా విషయానికే వస్తే ఇంకా నేను వినవలసినవి 73 కథలు ఉన్నాయి. సమయం దొరికినప్పుడల్లా వింటూనే ఉంటాను" అని చెప్పుకొచ్చాడు.

Nani
Keerthi Suresh
Dasara Movie

More Telugu News