Kajal Agarwal: బాలయ్యకు జోడీగా చందమామ

KajalAggarwal joins set of Balakrishna Anil Ravipudi film
  • అనిల్ రావిపూడితో బాలకృష్ణ 108వ చిత్రం
  • హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్
  • షూటింగ్ కు హాజరవుతున్న సీనియర్ హీరోయిన్
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే కమల్ హాసన్‌కి జంటగా ‘ఇండియన్‌ 2’లో నటిస్తున్న ఆమె.. తాజాగా మరో భారీ ప్రాజెక్టులోకి వచ్చింది. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాజల్ సోమవారం షూటింగ్‌ కు హాజరైంది. ఈ ఫొటోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాజల్ కు స్వాగతం పలికింది. 

‘మన నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన కథానాయికగా నటించబోతున్నారు. ఇది గొప్ప ప్రయాణం అవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా‘ అని అనిల్‌ రావిపూడి ట్వీట్ చేశారు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రంలో యువ నటి శ్రీలీల కీలకపాత్ర పోషిస్తోంది. ఆమె బాలకృష్ణకు కూతురుగా కనిపించనుందని తెలుస్తోంది. కాగా, కాజల్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ చిత్రం ‘కోస్టి’ ఉగాది సందర్భంగా బుధవారం విడుదలవనుంది.
Kajal Agarwal
Balakrishna
anil ravipudi
Tollywood

More Telugu News