'అథర్వ' టీజర్ రిలీజ్.. సినిమాపై అంచనాలు పెంచేసిన విజువల్స్!

  • కార్తీక్ రాజు హీరోగా రూపొందిన 'అథర్వ'
  • క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
  • కథానాయికగా సిమ్రన్ చౌదరి  
  • సంగీతాన్ని సమకూర్చిన శ్రీచరణ్ పాకాల

Atharva movie teaser released

పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యువ హీరో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా నటించిన  సినిమా 'అథర్వ'. డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా, సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశలో ఉన్నాయి. అతి త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ విడుదల చేసి సినిమాపై ఆసక్తి పెంచిన యూనిట్ .. తాజాగా వదిలిన టీజర్ తో ఆసక్తిని రెట్టింపు చేసింది. హీరో ఆకాష్ పూరి, క్లూస్ హెడ్ వెంకన్న, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, స్పై డైరెక్టర్ & ఎడిటర్ గ్యారీ,డైరెక్టర్స్ సుశాంత్ రెడ్డి, కనక మామిడి ముఖ్య అతిధులుగా హాజరై, చిత్ర టీజర్ ను విడుదల చేశారు.

ఈ టీజర్ చూస్తుంటే ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోతూ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఒక నిమిషం 15 సెకన్ల  నిడివితో కట్ చేసిన వీడియోలోని క్రైమ్ .. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ క్యూరియాసిటీ పెంచేశాయి. వరుస హత్యలకు సంబంధించిన మిస్టరీ చేధించేందుకు సైబరాబాద్ క్లూస్ టీమ్ లో జాయిన్ అయిన హీరో, హంతకులను పట్టుకోవడానికి ఎలాంటి పన్నాగాలు వేశాడు? అనేదే కథ.  శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ అట్రాక్షన్ అయింది.

  టీజర్ రిలీజ్ అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో  హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. టీజర్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. హీరో కార్తీక్ రాజు చాలా బాగా నటించాడు. దర్శకుడు  ఎంచుకున్న క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ స్టోరీ చాలా బాగుంది. ఇలాంటి సినిమాకు మ్యూజిక్ ఇంపార్టెంట్. శ్రీచరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'అథర్వ' సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

More Telugu News