వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

  • ఢిల్లీలో వెంకయ్య నివాసంలో ఉగాది శోభ
  • వేడుకలకు హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ
  • ఏపీ గవర్నర్ కు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను పరిచయం చేసిన వెంకయ్య
AP Governor attends Ugadi celebrations at Venkaiah Naidu residence in Delhi

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీ నివాసంలో నేడు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.  వెంకయ్య నాయుడు ఇంట ప్రతి సంవత్సరం ప్రముఖుల సమక్షంలో నూతన సంవత్సరాది వేడుకలను ఘనంగా జరుపుకోవడం అనవాయతీగా వస్తుంది. 

ఈసారి వెంకయ్య ఇంట ఉగాది వేడుకల్లో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ తదితరులతో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్ అహ్మద్, రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

రాజ్యసభ మాజీ సభ్యుడు, పద్మ భూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ను ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ కు వెంకయ్యనాయుడు పరిచయం చేసారు. బహుభాషా కోవిదునిగా యార్లగడ్డ దేశ ప్రజలకు సుపరిచితులని, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా సేవలు అందించారని వివరించారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో తామిద్దరం కలిసి పనిచేసామని గవర్నర్ కు వెంకయ్యనాయుడు తెలిపారు.

More Telugu News