'శాకుంతలం' నుంచి ప్రకాశ్ రాజ్ పోస్టర్ రిలీజ్!

  • ప్రమోషన్స్ వేగాన్ని పెంచుతున్న 'శాకుంతలం'
  • ప్రధానమైన పాత్రలను పరిచయం చేస్తూ వదులుతున్న పోస్టర్లు
  • ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్న మణిశర్మ సంగీతం
  • ఏప్రిల్ 14వ తేదీన ఐదు భాషల్లో విడుదల     

Shaakuntalam Prakash Raj Poster Released

సమంత అభిమానులంతా 'శాకుంతలం' సినిమా కోసం ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. సమంత చేసిన ఫస్టు పాన్ ఇండియా సినిమా ఇదే. నాయిక ప్రధానంగా నడిచే ఈ సినిమా, ఆమె కెరియర్లోనే ప్రత్యేకమైన స్థానంలో నిలవనుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అయిదు భాషల్లో విడుదల చేయనున్నారు.
 
మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచుతూ వెళుతున్నారు. ఐదు భాషలను ఒకేసారి కవర్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. సమంత పోస్టర్ మొదలు ఇతర పాత్రలను పోషించినవారి లుక్స్ ను పరిచయం చేస్తూ, ప్రాధాన్యతను బట్టి పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. 

రీసెంట్ గా మోహన్ బాబు పోస్టర్ ను రిలీజ్ చేసిన టీమ్, కొంతసేపటి క్రితం ప్రకాశ్ రాజ్ పోస్టర్ ను వదిలింది. ఈ సినిమాలో ఆయన పడవ నడిపే వ్యక్తిగా కనిపించనున్నారు. గర్భవతిగా ఉన్న శకుంతల, దుష్యంతుడి దగ్గరికి బయల్దేరుతుంది. ఆ క్రమంలో ఆమె పడవ ఎక్కుతుంది. ఈ పడవ ప్రయాణం కూడా కథలో కీలకమే. పడవపై చిత్రీకరించిన పాట కూడా ఆకట్టుకోనుంది.

More Telugu News