Revanth Reddy: హైదరాబాదులో రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

  • ఇటీవల టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజి కలకలం
  • ఒకే మండలంలో వందమందికి ర్యాంకులు వచ్చాయన్న రేవంత్
  • ఆధారాలు ఇవ్వాలన్న సిట్ అధికారులు
  • ఈ నెల 23న విచారణకు రావాలంటూ నోటీసులు
SIT officials reached Revamth Reddy residence

హైదరాబాదులో రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు, జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారు. రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో సిట్ అధికారులు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి నోటీసులు అతికించారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. 

ఇటీవల ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారం తెరపైకి రాగా, రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఒకే మండలంలో వంద మందికి ర్యాంకులు వచ్చాయని అన్నారు. దాంతో, రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు అందించాలని సిట్ అధికారులు నోటీసుల్లో కోరారు. 

నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, సిట్ నోటీసులు తనకు ఇంకా అందలేదని అన్నారు. అయితే తన వద్ద ఉన్న ఆధారాలను సిట్ కు ఇవ్వబోనని, ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే, తన వద్ద ఉన్న ఆధారాలను సిట్టింగ్ జడ్జికి అప్పగిస్తానని వెల్లడించారు.

More Telugu News