Sensex: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 360 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 111 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 
  • 4.25 శాతం పతనమైన బజాజ్ ఫిన్ సర్వ్ షేర్ విలువ  
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 360 పాయింట్లు కోల్పోయి 57,628కి పడిపోయింది. నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 16,988కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (2.45%), ఐటీసీ (0.80%), కొటక్ బ్యాంక్ (0.54%), సన్ ఫార్మా (0.37%), నెస్లే ఇండియా (0.30%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-4.25%), బజాజ్ ఫైనాన్స్ (-3.18%), విప్రో (-2.46%), టాటా స్టీల్ (-2.38%), టాటా మోటార్స్ (-1.96%).

More Telugu News