ఎన్టీఆర్ పై ‘ఆకాశమంత’ అభిమానం.. వీడియో వైరల్!

ntr fans in america surprised shows air plane banner
  • ఎన్టీఆర్ కు వినూత్న రీతిలో ధన్యవాదాలు చెప్పిన అభిమానులు
  • ‘థ్యాంక్యూ ఎన్టీఆర్’ అంటూ ఆకాశంలో ఎయిర్ ప్లేన్ బ్యానర్
  • తర్వాతి సినిమా కోసం ఎదురుచూస్తున్నామని ట్వీట్  
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ అయ్యారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. విదేశాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవలి అమెరికా పర్యటనలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అక్కడి ఫ్యాన్స్ తోనూ ఎన్టీఆర్ ముచ్చటించారు. 

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు ఫ్యాన్స్  వినూత్న రీతిలో ధన్యవాదాలు చెప్పారు. ఆకాశమంత అభిమానాన్ని చూపారు. విమానం వెనుక భాగంలో ‘ధన్యవాదాలు ఎన్టీఆర్.. తర్వాతి సినిమా కోసం ఎదురుచూస్తున్నాం (Thank you NTR. Can't wait for #NTR30)’ అని రాసి ఉన్న బ్యానర్ ను ఆకాశంలో ప్రదర్శించారు.

ఈ వీడియోను ‘ఎన్టీఆర్ ఫ్యాన్స్ యూఎస్ఏ’ అనే ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ‘‘ప్రపంచ సినిమాకు గుండె లాంటి హాలీవుడ్ పై.. ఎయిర్ ప్లేన్ బ్యానర్. ఆర్ఆర్ఆర్ సినిమాతో గుర్తుండిపోయే రైడ్‌కి ధన్యవాదాలు. ‘ఎన్టీఆర్ 30’ తో మ్యాన్ ఆఫ్ మాస్ మానియా కోసం వేచి చూస్తున్నాం. ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Go Back to Shorts
NTR
ntr fans in america
air plane banner
#NTR30
RRR

More Telugu News