ఆ పాట రాసింది నేనని తెలిసి మెగాస్టార్ షాకయ్యారు: కాసర్ల శ్యామ్

  • పాటల రచయితగా కాసర్ల శ్యామ్ బిజీ 
  • తెలంగాణ నేపథ్యంలోని పాటలపై పట్టు 
  • మరింత మంచి పేరు తెచ్చిన 'బలగం' పాటలు 
  • 'భోళా శంకర్' కి కూడా పాటలు అందించిన శ్యామ్  

Kasarla Shyam Interview

తెలంగాణ నేపథ్యంలో .. ఇక్కడి యాసతో సాగే పాటలకు సంబంధించి, ఈ మధ్య కాలంలో ఇక్కడ ఎక్కువగా వినిపిస్తున్న పేరు కాసర్ల శ్యామ్. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " ప్రైవేట్ ఆల్బమ్స్ కోసం రాయడం మొదలు పెట్టడంతో పాటల రచయితగా నా ప్రయాణం మొదలైంది. ఆ తరువాత ఎలక్షన్స్ సమయంలో పార్టీలకు సంబంధించిన పాటలను రాసేవాడిని'' అని అన్నారు. 

ఇటీవల వచ్చిన 'బలగం' సినిమాతో నాకు మరింత మంచి పేరు వచ్చింది. చిరంజీవిగారి 'భోళా శంకర్' సినిమా కోసం కూడా పాటలు రాసాను. ఆ పాట షూటింగు సమయంలో నేను అక్కడికి వెళ్లాను. నన్ను చిరంజీవిగారికి మెహర్ రమేశ్ పరిచయం చేశాడు. చిరంజీవిగారు ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు" అని చెప్పాడు. 

పవన్ కల్యాణ్ గారికీ .. చరణ్ గారికీ .. బన్నీ గారికి .. వరుణ్ తేజ్ గారికి పాటలు రాసినట్టుగా నేను చిరంజీవిగారికి చెప్పాను. 'అల వైకుంఠపురములో'  రాములో రాములా పాటను .. 'డీజే టిల్లు' పాటను నేనే రాసినట్టు చెప్పగానే ఆయన ఆశ్ఛర్యపోయారు. నా గురించి తెలుసుకోవాలసింది చాలా ఉందని ఆయన అనడం ఆనందాన్ని కలిగించింది' అని అన్నాడు. 


More Telugu News