Kim Jong Un: అణుదాడికి సిద్ధం కండి: కిమ్ సమరభేరి

  • 11 రోజుల పాటు సైనిక విన్యాసాలు చేపట్టిన అమెరికా, దక్షిణ కొరియా
  • ఉత్తర కొరియా సరిహద్దులకు సమీపంలో విన్యాసాలు
  • అణుదాడి జరిగితే తిప్పికొట్టేందుకు సన్నద్ధమవ్వాలన్న కిమ్
Kim alerts his forces to reply a nuke attack

అమెరికా, దక్షిణ కొరియా 11 రోజుల పాటు సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టడం పట్ల ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ మండిపడుతున్నారు. అది కూడా తమ సరిహద్దులకు చేరువలో ఈ విన్యాసాలు జరపడంతో కిమ్ భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో, అణుదాడికి సన్నద్ధమవ్వాలంటూ సైన్యానికి పిలుపునిచ్చారు. తమపై అణుదాడి జరిగితే తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. తద్వారా, అమెరికా, దక్షిణ కొరియాలకు తీవ్ర హెచ్చరికలు పంపించారు. 

ఇటీవల ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలను తీవ్రతరం చేసింది. నిన్న ఆదివారం కూడా ఓ ఖండాంతర క్షిపణిని ప్రయోగించి అమెరికా, దక్షిణ కొరియాలకు స్పష్టమైన సంకేతాలు పంపింది. ఈ క్షిపణి 800 కిమీ ప్రయాణించి, 800 కిమీ ఎత్తులోని లక్ష్యాన్ని ఛేదించడంతో కిమ్ హర్షం వ్యక్తం చేసినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. ఇటీవల ఉత్తర కొరియా ఒకే రోజున 4 క్షిపణులను పరీక్షించడం తెలిసిందే.

More Telugu News