Japan: భారత్ లో అడుగు పెట్టిన జపాన్ ప్రధాని

Japanese PM Fumio Kishida arrives in India for bilateral talks
  • రెండు రోజుల పాటు భారత్ లో పర్యటన
  • స్వాగతం పలికిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
  • కీలక ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై ప్రధాని మోదీతో చర్చ
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా భారత్ పర్యటనకు విచ్చేశారు. రెండు రోజుల పాటు దేశంలో పర్యటించనున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో జపాన్ ప్రధానికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆహ్వానం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీతో కిషిదా భేటీ అయి, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.

అంతర్జాతీయ పరిణామాలపైనా ఇరు ప్రధానులు చర్చింనున్నారు. జపాన్ జీ7 దేశాలకు అధక్ష్యత వహిస్తుంటే, భారత్ జీ20 దేశాలకు నాయకత్వం వహిస్తోంది. దీంతో జీ7, జీ20 మధ్య సహకారంపైన కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. అంతర్జాతీయ సవాళ్లు, భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యంపై తాను చర్చించనున్నట్టు జపాన్ ప్రధాని ట్విట్టర్ లో ప్రకటించారు. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ పైనా కిషిదా ప్రకటన చేయనున్నారు. 

Japan
Prime Minister
Fumio Kishida
India tour
bilateral talks
Narendra Modi

More Telugu News