KA Paul: అందువల్లే టీడీపీ గెలిచింది: కేఏ పాల్

  • ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీ చేయలేదన్న పాల్
  • టీడీపీ విజయానికి అదే కారణమని వెల్లడి
  • కుల, కుటుంబ పాలనకు అంతం పలకాలని పిలుపు
  • ప్రజాశాంతి పార్టీతోనే అది సాధ్యమని వెల్లడి
KA Paul comments

వైసీపీ, టీడీపీ, జనసేన, బీఆర్ఎస్ పార్టీలు ప్రధాని మోదీకి బీ-పార్టీలు అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. చంద్రబాబు, జగన్, కేసీఆర్, పవన్ కల్యాణ్ అన్ని విధాలుగా మోదీకి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారా? వీళ్లను నమ్మి మనం ఎందుకు మోసపోవాలి? అని ప్రశ్నించారు. 

ఇక, ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీ చేయలేదని, అందువల్లే టీడీపీ విజయం సాధించగలిగిందని అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ లను చంద్రబాబుకు తానే పరిచయం చేశానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసని అన్నారు. 

కేసీఆర్ ను చూసి ఏపీలో జగన్ వాతలు పెట్టుకున్నాడని, తెలంగాణలో జిల్లా సంఖ్యల పెంచితే, ఏపీలో కూడా అదే పని చేశారని వెల్లడించారు. 

కుల పాలన, కుటుంబ పాలన అంతం కావాలంటే అది ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమని అన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మీడియా చానళ్లు తనకు ప్రతిరోజు రెండు గంటలు కేటాయించాలని కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు.

More Telugu News