ఎన్టీఆర్ తో కలిసి షూటింగ్ లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా: జాన్వీ కపూర్

  • ఎన్టీఆర్ 30వ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్
  • ఎన్టీఆర్ తనకు ఇష్టమైన హీరో అన్న జాన్వీ
  • ఇప్పుడు తన కల నెరవేరుతోందని వెల్లడి
Janhvi Kapoor says she is excited to act in NTR30

జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఖరారయిన సంగతి తెలిసిందే. ఎప్పటినుంచో తెలుగులో ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న జాన్వీకి ఎన్టీఆర్ తో సినిమా రూపంలో అద్భుతమైన అవకాశం లభించింది. 

దీని గురించి జాన్వీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ తో కలిసి షూటింగ్ లో పాల్గొనేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నానని తెలిపింది. చిత్రీకరణ ఎప్పుడు మొదలుపెడతారు అంటూ రోజూ డైరెక్టర్ కు మెసేజులు పంపుతున్నానని వెల్లడించింది. ఎన్టీఆర్ తనకు ఇష్టమైన హీరో అని, ఎన్టీఆర్ తో నటించే అవకాశం ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థించేదాన్నని తెలిపింది. ఇప్పుడు తన కల నెరవేరుతోందని జాన్వీ కపూర్ వివరించింది. 

ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ రెండుసార్లు చూశానని... అందం, ఎనర్జీ కలయిక ఎన్టీఆర్ అని అభివర్ణించింది. ఎన్టీఆర్ 30వ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నెల 23న చిత్రీకరణ ప్రారంభం కానుంది.

More Telugu News