Pawan Kalyan: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక: పవన్ కల్యాణ్

Pawan Kalyan opines on Graduate MLC Election results
  • ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
  • మూడు స్థానాల్లోనూ వైసీపీకి ఓటమి
  • ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందన్న పవన్
  • అధికారం తలకెక్కిన నేతలకు పట్టభద్రులు కనువిప్పు కలిగించారని వెల్లడి
ఏపీలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఒక్కటి కూడా గెలవలేకపోవడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక అని స్పష్టం చేశారు. 

రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకులు... పట్టభద్రులు అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. అధికారం తలకెక్కిన నేతలకు పట్టభద్రులు కనువిప్పు కలిగించారని పేర్కొన్నారు. సందిగ్ధంలో ఉన్నవారికి పట్టభద్రులు దారిచూపించారని వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితమే వస్తుందని స్పష్టమైందని పవన్ తెలిపారు.
Pawan Kalyan
MLC Elections
Results
Graduates
Janasena
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News