కేటీఆర్ తో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన కవిత

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు
  • విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత
  • మహిళను ఈడీ కార్యాలయంలో విచారిస్తున్నారంటూ పిటిషన్
Kavitha leaves for Delhi

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు (మార్చి 20) ఢిల్లీలో ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, సోదరుడు కేటీఆర్ తో కలిసి కవిత ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తరలి వెళ్లారు. వారి వెంట బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు.

కాగా, మహిళను ఈడీ కార్యాలయంలో విచారించడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రేపటి ఈడీ విచారణకు ఆమె వ్యక్తిగతంగా హాజరవుతారా, లేక తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అటు, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది.

More Telugu News