bus fell into a ditch: బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం... నుజ్జునుజ్జయిన బస్సు... 17 మంది మృతి

17 killed 30 injured as bus falls into ditch in Bangladesh
  • అదుపుతప్పి కాలువలోకి పడిపోయిన బస్సు
  • ముందు భాగం పూర్తిగా ధ్వంసం
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం
బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయి... గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మంది చనిపోయారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మదారిపూర్‌లోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో జరిగిందీ ప్రమాదం.

సోనాదంగా నుంచి ఢాకాకు ఈ బస్సు బయల్దేరింది. ఉదయం 7.30 సమయంలో మదారిపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌ వేపై అదుపుతప్పి కాలువలోకి వేగంగా దూసుకెళ్లింది. కాలువ గోడను ఢీకొని ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని... స్థానిక ప్రజలతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం, బస్సులో మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. వేగానికి బస్సు టైర్ పగిలిపోయిందని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల కాలువలో పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
bus fell into a ditch
Bangladesh
17 killed
bus accident

More Telugu News