వంద మందితో ప్రభుదేవా నాటు నాటు స్టెప్పులు.. వీడియో ఇదిగో!

  • ఆస్కార్ అందుకున్న ఆర్ఆర్ఆర్ కు తనదైన స్టయిల్లో అభినందన 
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • ప్రభుదేవాకు కృతజ్ఞతలు తెలిపిన ఆర్ఆర్ఆర్ బృందం
Prabhu deva congratulates RRR team in natu natu style

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ప్రపంచాన్ని ఊపేసి ఆస్కార్ అవార్డు అందుకుంది. ఈ ఘనత సాధించిన భారత తొలి చిత్రంగా చరిత్ర సృష్టించింది. నాటు నాటు స్వరకర్త ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ తో పాటు ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఇండియన్ మైకేల్ జాక్సన్, దిగ్గజ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తనదైన స్టయిల్లో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. 

స్టూడియోలో వంద మందితో కూడిన తన బృందంతో ప్రభుదేవా నాటునాటు హూక్ స్టెప్పులు వేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆర్ఆర్ఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుదేవా ఆయన బృందం హుషారుగా చేసిన నాటు నాటు స్టెప్పు వీడియో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం.. థ్యాంక్యూ లెజెండ్ అని ట్వీట్ చేసింది.

More Telugu News