‘గ్రేట్ న్యూస్.. అల్లు అర్జున్ నన్ను అన్ బ్లాక్​ చేశాడు’: హీరోయిన్

  • అల్లు అర్జున్ సరసన వరుడులో హీరోయిన్ గా నటించిన భానుశ్రీ
  • ట్విటర్ లో ఆమెను బ్లాక్ చేసిన అల్లు అర్జున్
  • భానుశ్రీ ట్వీట్ చేయడంతో కొద్దిసేపటికే అన్ బ్లాక్ చేసిన బన్నీ
Great news Allu Arjun has unblocked me says bhanusri

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘వరుడు’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నటి భానుశ్రీ మెహ్రా. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిజాస్టర్ గా మారడంతో భానుశ్రీకి సరైన అవకాశాలు రాలేదు. కొన్ని చిన్న చిత్రాలు చేసినా అవి కూడా సరిగా ఆడకపోవడంతో ఆమె తెరమరుగైంది. ప్రస్తుతం తను కంటెంట్ క్రియేటర్ గా మారింది. ఉన్నట్టుండి ఆమె వార్తల్లో నిలిచింది. ట్విట్టర్ లో అల్లు అర్జున్ తనని బ్లాక్ చేశాడని ట్వీట్ చేసింది. ఆ స్క్రీన్ షాట్‌‌ని షేర్ చేసింది. 

‘నేను అల్లు అర్జున్‌తో వరుడులో నటించానని గుర్తుంచుకోండి. ఇప్పటికీ సరైన అవకాశాలు రావట్లేదు. కానీ ఈ ఇబ్బందుల్లోనూ సరదాగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఇప్పుడు అల్లు అర్జున్ నన్ను ట్విట్టర్‌లో బ్లాక్ చేసినా కూడా’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో బన్నీ ఆమెను ఎందుకు బ్లాక్ చేశాడా? అని ఫ్యాన్స్ ఆరాతీయడం మొదలు పెట్టారు. అయితే కొంత సమయం తర్వాత బన్నీ తనను అన్ బ్లాక్ చేశాడని భానుశ్రీ తెలిపింది. ‘గ్రేట్ న్యూస్, అల్లు అర్జున్ నన్ను అన్‌బ్లాక్ చేసాడు. నా కెరీర్ వైఫల్యాలకు నేను అతనిని ఎప్పుడూ నిందించలేదని స్పష్టం చేస్తున్నా’ అని ట్వీట్ చేసింది. అల్లు అర్జున్ కు థ్యాంక్స్ చెప్పింది.

More Telugu News