Whatsapp: వాట్సప్ లో కొత్త ఫీచర్స్.. కొన్ని రోజులే కనిపించేలా గ్రూప్

  • అటాచ్ మెంట్ సెక్షన్ లో రెడీ అయిన కొత్త వెర్షన్
  • గ్రూప్ లో చేరాలంటే ఇకపై అడ్మిన్ పర్మిషన్ తప్పనిసరి
  • వాట్సప్ కాల్స్ మ్యూట్, బ్లాక్ చేసుకునే ఆప్షన్
Whatsapp New Features available soon

వాట్సాప్‌లో కీలక మార్పు చోటు చేసుకోనుంది. అటాచ్‌మెంట్‌ సెక్షన్‌లో కొత్తగా వచ్చే వెర్షన్‌ (v2.23.6.17)లో పాప్‌ ఆప్‌ స్టైల్‌ పూర్తిగా మారనుంది. ఇది మొబైల్‌ ఫోన్లలో నోటిఫికేషన్‌ ఫ్యానల్‌ మాదిరిగా ఉండబోతున్నది. వాట్సాప్‌లో చేరిన వ్యక్తి పేరు సెర్చ్‌ చేస్తే.. అతడు సభ్యుడిగా ఉన్న గ్రూపుల వివరాలు కూడా తెలిసే ఫీచర్‌ కూడా అందుబాటులోకి వచ్చేలా మార్పులు జరిగాయి. గ్రూప్స్‌ ఇన్‌ కామన్‌ పేరుతో ఈ ఫీచర్‌ వస్తోంది.

ఇందుకు అనుగుణంగా బీటా వెర్షన్‌ వాట్సాప్‌లో మార్పులు చేర్పులు చేశారు. ఇప్పటివరకు వాట్సాప్‌ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలనుకున్న వారిని గ్రూప్ అడ్మిన్ యాడ్ చేస్తున్నాడు. గ్రూప్‌ ఇన్వైట్‌ లింక్‌ ద్వారా జాయిన్ అవ్వొచ్చు. కానీ ఇకపై గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే సంబంధిత గ్రూప్‌ అడ్మిన్‌ అనుమతి తప్పనిసరి. మార్పుల తర్వాత గ్రూప్‌ సమాచారంలోకి వెళితే అక్కడ పెండింగ్‌ పార్టిసిపెంట్స్‌ అనే ఆప్షన్‌ కింద కొత్త రిక్వెస్ట్‌లు చూడవచ్చు. 

ప్రస్తుతం వాట్సాప్‌ గ్రూపులో మన కాంటాక్ట్ లిస్ట్ లో లేని వ్యక్తి చాటింగ్ చేస్తున్నప్పుడు నంబర్ మాత్రమే కనిపిస్తుంది.. ఇకపై నంబర్‌కు బదులు సదరు వ్యక్తి వాట్సప్ లో పెట్టుకున్న పేరు కనిపిస్తుంది. ప్రస్తుతం వాట్సాప్‌ గ్రూప్‌, పర్సనల్ గా వచ్చే మెసేజ్‌లకు డిసప్పియరింగ్ మెసేజెస్ ఆప్షన్ ఉంది. త్వరలో వాట్సాప్ గ్రూప్‌కే డిసప్పియరింగ్ ఆప్షన్ రానుంది. 

ఏదైనా అవసరం కోసం కొన్ని రోజులు తాత్కాలికంగా గ్రూప్‌ క్రియేట్‌ చేసుకునే ఆప్షన్‌ తెస్తున్నారు. గ్రూప్‌ క్రియేట్‌ చేస్తున్నప్పుడే అది ఎన్ని రోజులు ఉండాలనే ఆప్షన్‌ చూపిస్తుంది. ఈ మేరకు నమోదు చేసిన సమయం వరకే వాట్సాప్ గ్రూప్‌ లైవ్‌లో ఉంటుంది. మొబైల్ కాల్స్ మాదిరిగా గుర్తుతెలిని వ్యక్తుల ఫోన్ కాల్స్ ను మ్యూట్, బ్లాక్ చేసే ఆప్షన్ కూడా వాట్సప్ లో రానుంది.

More Telugu News