భారత ప్రజాస్వామ్యంపై అక్కసు: ప్రధాని మోదీ
- ప్రజాస్వామ్య సంస్థలు విజయం సాధించడంతో వ్యక్తుల దాడి
- మన ప్రజాస్వామ్యం శక్తిని ప్రపంచానికి చాటి చెప్పామన్న ప్రధాని
- కొత్తదనాన్ని స్వాగతించే సామర్థ్యం ఉండాలన్న అభిప్రాయం
కొందరు వ్యక్తులు మన ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని, అయినా భారత్ ముందుకే ప్రయాణం చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఏ దేశ అభివృద్ధి అయినా, విధాన రూపకల్పనలో స్తబ్దత అన్నది అదిపెద్ద అవరోధం. మన దేశంలో వెనకటి తరహా ఆలోచన విధానాలు, కొన్ని కుటుంబాల పరిమితుల కారణంగా మరింత అడ్డంకి నెలకొంది. మనం మరింత ముందుకు వెళ్లాలంటే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. దేశం ఎదగాలంటే కొత్తదనాన్ని స్వీకరించే సామర్థ్యం ఉండాలి’’అని ప్రధాని పేర్కొన్నారు. భారత్ సాధించినది ఏదైనా కానీ, అది మన ప్రజాస్వామ్యం శక్తి, మన సంస్థల సామర్థ్యం వల్లేనన్నారు.