Nara Lokesh: రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తాం: నారా లోకేశ్

  • శ్రీ సత్యసాయి జిల్లాలో కొనసాగుతున్న యువగళం
  • కదిరి నియోజవకర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • ప్రజల నుంచి అపూర్వ ఆదరణ
  • ఉత్సాహంగా కదులుతున్న లోకేశ్
Lokesh yuvagalam padayatra details

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 46వ రోజు (శనివారం) శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కొనసాగింది. చీకటిమానిపల్లి విడిది కేంద్రం నుండి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. అడుగడుగునా మహిళలు హారతులివ్వగా యువత, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. యర్రగుంట్లపల్లికి చేరుకున్న లోకేశ్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలు చేయగా పార్టీ కార్యకర్తలు దేహశుద్ధి చేసి పంపారు. పోలీసులు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

లోకేశ్ హామీలు....

  • అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఎండోమెంట్స్ నిధులతో దేవాలయాలు నిర్మిస్తాం.
  •  ఆయా ఆలయాల్లో పనిచేసే పూజారులకు గౌరవవేతనాలు కూడా చెల్లిస్తాం.
  •  గిరిజన తాండాలకు లింకురోడ్డు సౌకర్యం కల్పిస్తాం. 
  • తాండాలకు ఫోన్ కనెక్టివిటీ చాలా అవసరం. చంద్రబాబు పాలనలో ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రత్యేకంగా తాండాలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించి... 6 లక్షల కనెక్షన్లు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం ఆపేసింది. మేము వచ్చాక తాండాలకు ఇంటర్ నెట్ కనెక్షన్ ఇస్తాం. 
  • ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం
  • ఎస్టీల్లో నిరుద్యోగ సమస్య ఉంది. గతంలో మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాం. మేము వచ్చాక ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను పద్ధతి ప్రకారం భర్తీచేస్తాం. 
  • 2025 జనవరిలో జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. ఒక్క గిరిజనులే కాదు..అందరి పిల్లలూ ఉద్యోగాలకు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. టీడీపీ వచ్చాక కొక్కింటి క్రాస్ లో ఎస్టీలకు భవనం నిర్మిస్తాం. 
  • టీడీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. గతంలో అందించిన రాయితీలన్నింటినీ పునరుద్ధరిస్తాం.
  • టీడీపీహయాంలో కాపు కార్పొరేషన్ ను ఏర్పాటుచేసి కాపుల సంక్షేమనికి 5 ఏళ్లలో రూ.3,100 కోట్లు ఖర్చుచేశాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కాపు కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి తీరని ద్రోహం చేసింది. అధికారంలోకి వచ్చాక కాపు, బలిజ సోదరులకు అండగా నిలబడి న్యాయం చేస్తాం.

లోకేశ్ మాటల తూటాలు....

  • నా యుద్ధం నిరుద్యోగ సమస్యపైనే!
  • నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి... జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. 
  • 45 రోజుల యువగళం పాదయాత్రతో ప్రజల్లో మార్పు కనబడుతోంది. 45 ఏళ్లు నిండిన ఎస్టీ మహిళలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తా అన్నాడు... ఇచ్చాడా? మిమ్మల్ని అడుగడుగునా ఈ సీఎం మోసం చేస్తున్నాడు. 
  • రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కాపులు, బలిజలను అణచివేయడమే పనిగా పెట్టుకున్నారు. 
  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ సీనియర్ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, బోండా ఉమ వంటి వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించారు. 

కుమార్తెని చంపుకునేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని 2016లో త‌ల్లిదండ్రులు పెట్టుకున్న మెర్సీ కిల్లింగ్ పిటిష‌న్ గుర్తుందా?

 చిత్తూరు జిల్లా మొలకలచెరువు మండలం ఆర్.ఎస్.కొత్తపల్లికి చెందిన జ్ఞాన‌సాయి అనే బాలిక కాలేయ స‌మ‌స్యతో బాధ‌ప‌డగా, చికిత్సకి 40 ల‌క్ష‌లకి పైగా ఖ‌ర్చవుతుంద‌ని వైద్యులు చెప్పారు. అంత స్థోమ‌త లేని ర‌మ‌ణ‌ప్ప డ‌బ్బు కోసం అన్ని ప్ర‌య‌త్నాలు చేశాడు. ఇక త‌న పాప‌ని బ‌తికించుకోలేన‌ని మెర్సీ కిల్లింగ్‌కి అనుమ‌తి కావాలంటూ మీడియా ద్వారా విన్నవించాడు. 

అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి సర్కారు ఖర్చుతో వైద్యం చేయించాలని ఆదేశించారు. చంద్ర‌బాబు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరు చేసిన 40 ల‌క్ష‌ల‌తో లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ చేయించి జ్ఞాన‌సాయిని కాపాడారు. 9 నెలల వయస్సులో ఆప‌రేష‌న్ జ‌రిగిన త‌రువాత చిన్నారి జ్ఞాన‌సాయి మందుల‌కి, నెల‌నెలా ప‌రీక్ష‌ల‌కి ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు కాగా టీడీపీ ప్రభుత్వం సాయం అందించింది. ఇప్పుడు ఆ పాప పెరిగి పెద్ద‌ అయ్యింది. 

నాడు సీఎం చంద్రబాబు చేసిన సాయంతోనే త‌మ పాప జ్ఞాన‌సాయి ప్రాణాల‌తో నిలిచింద‌ని లోకేష్‌ని క‌లిసిన రమణప్ప కుటుంబం కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేసింది. చంద్ర‌బాబు గారు సీఎంగా ఉన్న‌ప్పుడు కాంట్రాక్టు జాబ్ కూడా ఇప్పించార‌ని, వైసీపీ వ‌చ్చాక అదే జాబ్ కార‌ణంగా త‌న పాప జ్ఞాన‌సాయి, త‌ల్లికి వ‌చ్చే పెన్ష‌న్లు నిలిపేశార‌ని ర‌మ‌ణ‌ప్ప లోకేశ్ ఎదుట వాపోయాడు. ఇప్పటికీ పాప మందుల‌కి నెల‌కి 20 వేలు అవుతోంద‌ని, ఇది త‌మ‌కి చాలా భారంగా మారింద‌ని ఆవేద‌న వ్యక్తం చేశాడు. పార్టీ త‌ర‌ఫున వీలైన సాయం చేస్తామ‌ని లోకేశ్ భ‌రోసా ఇచ్చారు.

యువగళం పాదయాత్ర వివరాలు:

*ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 591 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 14.1 కి.మీ.*

*యువగళం పాదయాత్ర 47వ రోజు షెడ్యూల్ (19-3-2023)*

*కదిరి నియోజకవర్గం (శ్రీ సత్యసాయి జిల్లా).*

ఉదయం

8.00 – చినపిల్లోలపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.15 – సంజీవుపల్లిలో స్థానికులతో మాటామంతీ.

10.05 – నల్లచెరువులో చేనేతలతో సమావేశం.

10.45 – ఘాజీఖాన్ పల్లి వద్ద స్థానికులతో మాటామంతీ.

11.50 - పయాలవారిపల్లిలో భోజన విరామం.

మధ్యాహ్నం

2.25 – పయాలవారిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం.

2.45 – నల్లచెరువు రైల్వేస్టేషన్ వద్ద స్థానికులతో మాటామంతీ.

సాయంత్రం

*3.00 – పాదయాత్ర 600 కిలోమీటర్లకు చేరిక*

3.25 – రత్నాలపల్లిలో కురుబ సామాజికవర్గీయులతో భేటీ.

4.05 – బొమ్మిరెడ్డిపల్లిలో స్థానికులతో మాటామంతీ.

4.40 – చిన్నయాళ్లంపల్లిలో 600 కిలోమీటర్ల సందర్భంగా అభివృద్ధి కార్యక్రమానికి శిలాఫలకం ఆవిష్కరణ.

5.00 - జోగన్నపేట బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగం.

6.00 – జోగన్నపేట విడిదికేంద్రంలో బస.



More Telugu News