Rain: విశాఖలో టీమిండియా, ఆసీస్ క్రికెటర్లకు స్వాగతం పలికిన వర్షం

Rain welcomes Team India and Aussies cricketers in Vizag
  • విశాఖలో రేపు రెండో వన్డే
  • నగరానికి చేరుకున్న టీమిండియా, ఆసీస్ జట్లు
  • నేరుగా రాడిసన్ బ్లూ హోటల్ కు పయనమైన ఆటగాళ్లు
విశాఖలో రేపు (మార్చి 19) రెండో వన్డే జరిగే సూచనలు కనిపించడంలేదు. విశాఖలో రేపు ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం చెప్పగా, ఈ సాయంత్రమే నగరంలో జల్లు కురిసింది. 

అటు, వన్డే మ్యాచ్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు నగరానికి చేరుకున్నాయి. విశాఖ ఎయిర్ పోర్టులో క్రికెటర్లకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఇరుజట్ల ఆటగాళ్లు భారీ బందోబస్తు నడుమ ఎయిర్ పోర్టు నుంచి రాడిసన్ బ్లూ హోటల్ కు పయనమయ్యారు. వర్షం నేపథ్యంలో ఆటగాళ్ల ప్రాక్టీసు లేనట్టేనని తెలుస్తోంది. ఇక, రేపు మ్యాచ్ జరిగే అంశం వరుణుడిపైనే ఆధారపడి ఉంది.
Rain
Vizag
Team India
Australia

More Telugu News