Chandrababu: తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Chandrababu convey birthday wishes to his younger brother Rammurthy Naidu
  • నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నారా రామ్మూర్తి నాయుడు
  • ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ ఆశీస్సులందించిన చంద్రబాబు
  • ఎప్పటికీ అండగా ఉంటానంటూ ట్వీట్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "నా తమ్ముడు రామ్మూర్తి నాయుడికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. నీకు ఎప్పటికీ అండగా ఉంటాను" అని పేర్కొన్నారు. అంతేకాదు, రామ్మూర్తి నాయుడితో కలిసున్న ఫొటోను కూడా చంద్రబాబు పంచుకున్నారు.
Chandrababu
Rammurthy Naidu
Birthday
Wishes
TDP

More Telugu News