వ్యూస్ ల రేసులో దూసుకుపోతున్న 'కస్టడీ' టీజర్!

  • చైతూ హీరోగా రూపొందిన 'కస్టడీ'
  • ఆయన జోడీకట్టిన కృతి శెట్టి 
  • ప్రతినాయకుడిగా అరవింద్ స్వామి 
  • తెలుగు .. తమిళ భాషల్లో సినిమా రిలీజ్ 
Custody movie teaser released

నాగచైతన్య ఇటీవల చేసిన 'థ్యాంక్యూ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. విక్రమ్ కుమార్ అనుభూతి కావ్యంగా మలచిన ఆ సినిమాకి ప్రయోజనం దక్కలేదు. ఆ తరువాత చైతూ యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉన్న కథను ఎంచుకున్నాడు .. ఆ సినిమా పేరే 'కస్టడీ'. 

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను రూపొందించాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రీసెంటుగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. 'చావు ఎటు వైపు నుంచి వస్తుందో నాకు తెలియదు .. ఒక్క నిజమనే ఆయుధం మాత్రమే నా దగ్గరుంది' అనే చైతూ డైలాగ్ .. టీజర్ కి హైలైట్ గా నిలిచింది.
 
తెలుగు .. తమిళ భాషల్లో ఈ టీజర్ ను ఇలా వదిలారో లేదో అలా దూసుకుపోతోంది. ఈ రెండు భాషల్లోను కలుపుకుని, 15 మిలియన్ ప్లస్ వ్యూస్ లభించాయి. ఇంకా ఫాస్టుగా ఈ నెంబర్స్ మారుతూనే ఉన్నాయి. కృతి శెట్టి కథానానాయికగా నటించిన ఈ సినిమాలో, అరవిందస్వామి ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.

More Telugu News