Bhumireddy Ramgopal Reddy: పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు... ఆధిక్యంలోకి వచ్చిన టీడీపీ అభ్యర్థి

TDP candidate gets lead in West Rayalaseema Graduates MLC votes counting
  • ఉత్కంఠభరితంగా పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
  • ఈ మధ్యాహ్నం వరకు ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి
  • మధ్యాహ్నం తర్వాత పుంజుకున్న టీడీపీ అభ్యర్థి
ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జోరు కనబరుస్తోంది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఇప్పటికే టీడీపీ రెండింటిలో విజయం సాధించింది. ప్రస్తుతం పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజాగా టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు. 

నిన్న ఓట్లు లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఈ మధ్యాహ్నం వరకు వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. అయితే రవీంద్రారెడ్డి ఆధిక్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ సాయంత్రానికి టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆధిక్యం స్పష్టమైంది. బీజేపీ అభ్యర్థి రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు తర్వాత టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలోకి వచ్చారు. వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ 400కి పైగా ఓట్ల ఆధిక్యంలో ఉందని స్వయంగా చెప్పడం విశేషం. ప్రస్తుతం పీడీఎఫ్ అభ్యర్థి నాగరాజు రెండో ప్రాధాన్యతా ఓట్లు లెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.
Bhumireddy Ramgopal Reddy
TDP
West Rayalaseema
Graduates MLC
YSRCP
Andhra Pradesh

More Telugu News