వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు ఇదే నాంది: గంటా శ్రీనివాసరావు
- జగన్ పాలన కూల్చివేతలతో ప్రారంభమయిందన్న గంటా
- వైసీపీ వాళ్లు వెండి నాణేలు పంచినా ఫలితం దక్కలేదని వ్యాఖ్య
- రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్న గంటా
ఉత్తరాంధ్రలో మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని... వెండి నాణేలు, డబ్బులు పంచారని, అవకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదని, బుల్లెట్ దిగిందా, లేదా అనేది ముఖ్యమని... టీడీపీ అభ్యర్థి చిరంజీవి ఆలస్యంగా వచ్చినా ఘన విజయం సాధించారని అన్నారు. వైసీపీ వాళ్లు దొంగ ఓట్లు కూడా నమోదు చేయించినప్పటికీ ఫలితం దక్కలేదని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు ఈ ఎన్నికలే నాంది అని చెప్పారు.