Chandrababu: చంద్రబాబు లేఖకు స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి

  • ఏపీలో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
  • విశాఖలో వైవీ సుబ్బారెడ్డి పర్యటన
  • స్థానికేతరుడైన సుబ్బారెడ్డికి విశాఖలో ఏం పని అని ప్రశ్నించిన టీడీపీ
  • సీఈవోకి లేఖ రాసిన చంద్రబాబు
State Chief Election Officer responds to Chandrababu letter

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి విశాఖలో పర్యటించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాయడం తెలిసిందే. ఈ లేఖపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి స్పందించారు. ఈ వ్యవహారంలో ఫ్లయింగ్ స్క్వాడ్, తహసీల్దార్, ఎస్ఐలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించారు. దాంతో, వైవీ సుబ్బారెడ్డిపైనా చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు మరో లేఖ రాశారు. 

ఏపీలో ఈ నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగ్గా, విశాఖలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైవీ సుబ్బారెడ్డి పర్యటించారని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు చంద్రబాబు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. 

వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల నియమావళిని అతిక్రమించారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ స్థానికేతరుడైన సుబ్బారెడ్డికి విశాఖలో ఏం పని? అని మండిపడ్డారు.

More Telugu News