'ఉగాది'కి పోటీపడుతున్న సినిమాలివే!

  • ఉగాదికి విడుదలవుతున్న 'రంగ మార్తాండ'
  •  అదే రోజున వస్తున్న 'దాస్ కా ధమ్కీ'
  • బరిలోనే ఉన్న 'కోస్టీ' ... 'గీత సాక్షిగా'
  • మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్
Ugadi New Movies Update

'ఉగాది' అనగానే కొత్త ఏడాది మొదలు అనే ఒక సెంటిమెంట్ చాలామందిలో ఉంటుంది. అందువలన ఆ రోజున తమ సినిమాలకి సంబంధించిన పోస్టర్లు .. టీజర్లు .. ట్రైలర్లు వదులుతూనే ఉంటారు. అలా ఆ రోజున సినిమాల సందడి ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక ఆల్రెడీ విడుదలకి ముస్తాబైన సినిమాలను బరిలోకి దింపేస్తూ ఉంటారు. అలా ఈ నెల 22వ తేదీన థియేటర్లకు వస్తున్న సినిమాల సంఖ్య పెరుగుతుండటం విశేషం. 

కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'రంగ మార్తాండ' ఉగాది రోజునే విడుదలవుతోంది. ఆ రోజున వస్తున్న వాటిలో ఇదే పెద్ద సినిమా అనుకోవాలి. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాపై మంచి బజ్ కనిపిస్తోంది. ఆ తరువాత స్థానంలో విష్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ ' కనిపిస్తోంది. ఈ సినిమాకి హీరోనే దర్శకుడు .. నిర్మాత. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాపై బజ్ కనిపిస్తోంది. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్ అలరించనుంది. ఈ నెల 22వ తేదీన భారీ స్థాయిలోనే ఈ సినిమాను వదులుతున్నారు. ఇక అదే రోజున 'గీత సాక్షిగా' విడుదల కానుంది. ఆదర్శ్ - చిత్ర శుక్ల జంటగా నటించిన ఈ సినిమాకి, ఆంథోని మట్టిపల్లి దర్శకత్వం వహించాడు. గోపీసుందర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. కాజల్ మూవీ 'కోస్టి' కూడా ఇదే రోజున ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతానికి ఈ నాలుగు సినిమాలు ఈ రోజును ఫిక్స్ చేసుకున్నాయి. ఇంకా ఎన్ని సినిమాలు ఈ డేట్ దిశగా పరిగెత్తుకు వస్తాయనేది చూడాలి.

More Telugu News