four years kid: బీహార్ లో బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కిన నాలుగేళ్ల బాలుడు

  • కరోనా టైంలో వైరస్ వ్యాప్తికి కారణమయ్యాడని కేసు నమోదు
  • ఆశ్చర్యం వ్యక్తం చేసిన న్యాయమూర్తి
  • అరెస్టు, బెయిల్ కు ఎలాంటి నిబంధనలు లేవని తేల్చిన కోర్టు
  • కేసును కొట్టేయాలంటూ పోలీసులకు ఆదేశాలు
 Four years kid appeal to bihar court for bail

కరోనా కాలంలో పెట్టిన ఓ కేసుకు సంబంధించి బెయిల్ కావాలంటూ నాలుగేళ్ల పిల్లాడు కోర్టును ఆశ్రయించాడు. ఆ పిల్లాడిపై నమోదు చేసిన కేసును పరిశీలించిన న్యాయమూర్తి.. ఈ కేసుకు సంబంధించి అరెస్టు, బెయిల్ కు ఎలాంటి నిబంధనలు లేవని తేల్చారు. కేసు లేదు, బెయిలూ లేదు పొమ్మన్నారు. బీహార్ లోని బెగుసరాయ్ జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన.

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా వుండడంతో 2021 లో బెగుసరాయ్ జిల్లాలో పలు ప్రాంతాలను అధికారులు కంటైన్ మెంట్ జోన్లుగా మార్చారు. బారికేడ్లను పెట్టి రోడ్డును మూసేశారు. అయితే, స్థానికులు కొందరు ఈ బారికేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అప్పటికి నిండా రెండేళ్లు కూడా లేని పిల్లాడిపైనా పోలీసులు కేసు పెట్టారు. బారికేడ్లను తొలగించి వైరస్ వ్యాప్తికి కారణమయ్యారని ఆరోపించారు.

తన కొడుకుపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిందనే విషయం తల్లికి ఇటీవలే తెలిసింది. దీంతో బెయిల్ కోసం కొడుకును వెంటబెట్టుకుని బెగుసరాయ్ కోర్టును ఆశ్రయించింది. చిన్న పిల్లాడిపైన కేసేంటని పరిశీలించిన న్యాయమూర్తి.. పోలీసులను మందలించారు. వెంటనే ఆ పిల్లాడిపై కేసు కొట్టేయాలని ఆదేశించారు.

More Telugu News