Mitchell Starc: నిప్పులు చెరుగుతున్న స్టార్క్.. 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్

  • వాంఖెడే స్టేడియంలో టీమిండియా వర్సెస్ ఆసీస్
  • 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆసీస్ ఆలౌట్
  • స్టార్క్ ధాటికి టీమిండియా టాపార్డర్ విలవిల
  • 3 వికెట్లతో దెబ్బకొట్టిన స్టార్క్
Starc on fire as Team India loses 4 quick wickets

ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా కష్టాల్లో పడింది. ఆసీస్ లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ విజృంభించడంతో టీమిండియా 39 పరుగులకే 4 కీలక వికెట్లు చేజార్చుకుంది. 

స్టార్క్ కొత్తబంతితో పేస్, స్వింగ్ కలగలిపి బంతులు విసరడంతో టీమిండియా టాపార్డర్ విలవిల్లాడింది. విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్ (0)లను వరుస బంతుల్లో అవుట్ చేసిన స్టార్క్... మరికొన్ని ఓవర్ల తర్వాత ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (20)ను కూడా పెవిలియన్ కు తిప్పి పంపాడు. 

అంతకుముందు, మార్కస్ స్టొయినిస్... ఓపెనర్ ఇషాన్ కిషన్ (3)ను అవుట్ చేయడం ద్వారా టీమిండియా వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

More Telugu News