Team India: ఆసీస్ ను స్వల్ప స్కోరుకే కుప్పకూల్చిన టీమిండియా

Team India scalps Aussies for 188 runs in 1st ODI
  • ముంబయిలో టీమిండియా వర్సెస్ ఆసీస్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్
  • చెరో మూడు వికెట్లు తీసిన షమీ, సిరాజ్
తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై టీమిండియా బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ముంబయి వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసీస్... టీమిండియా బౌలర్ల ధాటికి 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌట్ అయింది. 

టీమిండియా పేసర్లు షమీ, సిరాజ్ చెరో 3 వికెట్లతో కంగారూలను హడలెత్తించారు. జడేజా 2 వికెట్లు తీయగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు. 

ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ మిచెల్ మార్ష్ 81 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ 26, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 22 పరుగులు చేశారు. లబుషేన్ (15), గ్లెన్ మ్యాక్స్ వెల్ (8), ఓపెనర్ ట్రావిస్ హెడ్ (5), ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ (12) విఫలమయ్యారు.
Team India
Australia
1st ODI

More Telugu News