Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీశ్ సిసోడియా ఈడీ కస్టడీ పొడిగింపు

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవల సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ
  • నేటితో ముగిసిన కస్టడీ
  • తాజాగా మరో 5 రోజుల కస్టడీ పొడిగింపు
  • ఇప్పటికే సిసోడియాపై సీబీఐ కేసు
  • తీహార్ జైల్లో ఉన్న సిసోడియా
ED Custody for Manish Sisodia extended

లిక్కర్ స్కాంలో ఇటీవల అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కస్టడీని పొడిగించారు. ఈ కేసులో మార్చి 9న సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. నేటితో ఈడీ కస్టడీ ముగియగా, ఆయనను కోర్టులో హాజరుపరిచారు. 

ఈ నేపథ్యంలో, న్యాయస్థానం సిసోడియాకు 5 రోజుల కస్టడీ విధించింది. దాంతో ఈ నెల 22 వరకు సిసోడియా ఈడీ కస్టడీలో ఉండనున్నారు. మార్చి 22న మధ్యాహ్నం 2 గంటలకు సిసోడియాను తమ ఎదుట హాజరు పరచాలని స్పెషల్ జడ్జి ఎంకే నాగ్ పాల్ ఈడీ అధికారులను ఆదేశించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ అభియోగాలపై ఈడీ విచారణ జరుపుతోంది.

 ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ ఇంతకుముందే సిసోడియాను అరెస్ట్ చేసింది. ఫిబ్రవరి 26న ఆయనను అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మార్చి 6 వరకు ఆయన సీబీఐ కస్టడీలో ఉండగా, ఆ తర్వాత ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఇటీవల ఈడీ అరెస్ట్ నేపథ్యంలో, మార్చి 10న ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

కొందరికి లబ్ది చేకూరేలా ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్పులు చేశారని, ముడుపులు అందుకుని లిక్కర్ లైసెన్సులు ఇచ్చారని సిసోడియా, తదితర ఆప్ నేతలపై ఆరోపణలు రావడం తెలిసిందే.

More Telugu News