ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి మృతి
- నిన్న అరుణాచల్ ప్రదేశ్ లో కుప్పకూలిన హెలికాప్టర్ చీతా
- వీవీబీ రెడ్డితో పాటు మేజర్ జయంత్ కూడా కన్నుమూత
- నేడు హైదరాబాద్ కు వీవీబీ రెడ్డి మృతదేహం
వినయ భానురెడ్డికి భార్య స్పందనారెడ్డి, కుమార్తెలు అనికరెడ్డి(6), హర్వికరెడ్డి(4) ఉన్నారు. స్పందనారెడ్డి కూడా పూణెలో ఆర్మీలో దంత వైద్యురాలుగా పనిచేస్తున్నారు. వారి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం. భానురెడ్డి తండ్రి నర్సింహ్మారెడ్డి గత 40 సంవత్సరాల నుంచి మల్కాజిగిరిలోని దుర్గానగర్‌లో నివాసముంటున్నారు. 2007లో ఆర్మీలో ఉద్యోగం సాధించిన వీవీబీ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి లెప్టినెంట్ కల్నల్ స్థాయికి చేరారు. ప్రస్తుతం ఆయన పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్‌లో శుక్రవారం వీవీబీరెడ్డి మృతదేహం నగరానికి రానుంది.