‘ఖలేజా’ నటుడు అమన్‌పై అమెరికాలో దాడి.. వీడియో ఇదిగో!
- కాలిఫోర్నియా జిమ్‌లో అందరూ చూస్తుండగానే దాడి
- శరీరంపై పలుచోట్ల కత్తి గాయాలు
- హిందీ, పంజాబీ, తెలుగు సినిమాల్లో నటించిన పంజాబీ నటుడు
అమన్‌పై నిందితుడు ఎందుకు దాడిచేశాడన్న విషయంలో క్లారిటీ లేదు. శరీరమంతా కట్లతో ఉన్న ధలీవాల్ ఫొటో, నిందితుడు దాడిచేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధలీవాల్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి కానీ, ఆయన కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
పంజాబ్‌లోని మాన్సాకు చెందిన ధలీవాల్ పంజాబీ, హిందీతోపాటు పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు. హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ నటించిన జోదా అక్బర్ సినిమాలో రాజ్‌కుమార్ రతన్‌సింగ్ పాత్ర పోషించారు. తెలుగులో ఖలేజా సినిమాలో నటించారు. అలాగే విస్రా, ఇక్‌కుడి పంజాబ్ డి, జాట్ బాయ్స్ పూత్ జట్టన్ డి, అనంత్ ది ఎండ్ తదితర సినిమాల్లో నటించారు.